స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. శుక్రవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.