

బంజారాహిల్స్: నడిరోడ్డుపై పిస్టల్ తో యువకుల హాల్ చల్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాలిలో పిస్టల్ తిప్పుతూ న్యూసెన్స్ కు పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాలు. సర్వి హోటల్ సమీపంలో కొందరు యువకులు నెంబర్ ప్లేట్ లేని ఓపెన్ టాపు జీపులో వెళ్తున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో పాటు ఓ యువకుడు పిస్టల్ ను గాలిలో తిప్పుతూ వెళ్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.