పాకిస్థాన్ కరాచీలోని జిన్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు సహా ఒక పాకిస్థానీ మృతిచెందారు. మరో 17 మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఈ ఘటనను ఉగ్రదాడిగా డ్రాగన్ పేర్కొంది. ఈ పేలుడుపై సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా, దాడి తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది.