గన్నేరు మొక్క చాలా విషపూరితమైనదని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హార్టికల్చరిస్ట్ ఫియోనా జెంకిన్స్ పేర్కొన్నారు. ఈ మొక్క ఆకులు, పూవులు, కాయలను కొద్దిగా తిన్నా చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ మొక్క వల్ల అలర్జీలు, చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ మొక్క వల్ల మనుషులలో గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, వాంతులు, విరేచనాలు, వికారం, బీపీ తగ్గిపోవడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.