వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు

55பார்த்தது
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేపట్టనుంది. ఈ మేరకు పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టులోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర శాఖల నుంచి తీసుకుని వీఆర్వోలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி