వనపర్తి ఆర్టీసీ డిపోలో కార్మికుల డిమాండ్స్ డే

81பார்த்தது
వనపర్తి ఆర్టీసీ డిపోలో కార్మికుల డిమాండ్స్ డే
రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో గురువారం డిమాండ్స్ డే నిర్వహించారు. డిపో కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ. అన్ని డిపోలలో నియామకాలు చేపట్టి కార్మికులకు పనిభారం తగ్గించాలన్నారు. టికెట్ పంపిణీ చేసే టీం మిషన్లు కొత్తవి అందించాలని, డ్రైవర్లు, కండక్టర్లపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు గోవర్ధన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி