పాలమూరు ప్రాజెక్టును సందర్శించాలని మాజీ మంత్రి నాగం డిమాండ్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును సందర్శించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు, రంగారెడ్డి, వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ లోని కుమ్మెర గ్రామం వద్ద పది రోజుల క్రితం నీటిలో మునిగిన పంప్ హౌస్, సర్జిపుల్ మోటర్లను పరిశీలించారు.