ఆహార సంక్షోభానికి దారితీసి తీవ్ర కరువు ఏర్పడటంతో 200 ఏనుగులను చంపనున్నట్లు జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించిందని ఆ దేశ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. తమ వద్ద అవసరమైన దానికంటే ఎక్కువ ఏనుగులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ మంత్రి సిథెంబిసో న్యోని తెలిపాడు. తీవ్ర కరవు కారణంగా ఇటీవల నమీబియా సైతం 700కు పైగా అడవి జంతువులను వధించింది.