ఒకే రకమైన పంట సాగు చేయకుండా రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామంలో నరసింహారెడ్డి రైతు తన 18 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగును కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. సంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.