వంగూరు: వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా కేవీఎన్ రెడ్డి
తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా కేవీ నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈయన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కేవీఎన్ రెడ్డి నియామకంతో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాండురంగారెడ్డి, వేమారెడ్డి, బొజ్జ కృష్ణారెడ్డి, కడారి జంగయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.