నాగర్ కర్నూల్ జిల్లా లింగాల ఎస్సై జగన్ దురుసు ప్రవర్తనపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నారు. లింగాలలో గొడవ సంఘటనలో ముగ్గురు యువకులకు శిరోమండనం చేయించిన కేసులో ఎస్సై జగన్ పై వేటు పడింది. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో జోగులాంబ 7వ జోన్ డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్సై జగన్ పై చర్యలు తీసుకున్నారు. అయినను విఆర్ లో పెడుతూ వనపర్తి పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.