ఆత్మకూరులో శుక్రవారం గతంలో పోగొట్టుకున్న ఫోనును బాధితుడికి ఎస్ఐ నరేందర్ అప్పగించారు. పట్టణానికి చెందిన లక్ష్మణరావు ఈనెల 7వ తేదీన ఆత్మకూరు నుండి వనపర్తికి బైక్ పై వెళ్లున్న సమయంలో ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఈఐర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకుని బాధితుడికి శుక్రవారం అప్పగించడం జరిగిందని ఎస్ఐ నరేందర్ పేర్కొన్నారు.