దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దివ్యాంగుల అసైన్‌మెంట్ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో వినికిడి లోపం, అంధులకు, శారీరక, మానసిక దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సహాయ పరికరాలు అందించేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.