దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులపై మంచి పట్టు సాధించాలన్నారు.