దేవరకద్ర: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కలెక్టర్ స్థల పరిశీలన

55பார்த்தது
దేవరకద్ర: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కలెక్టర్ స్థల పరిశీలన
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమాగ్నాపూర్ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి స్థల పరిశీలన చేశారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி