మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాపై బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హసీనా రాజీనామాను ధృవీకరించే ఆధారాలు లేవని తెలిపారు. హసీనా లేఖ ఎక్కడుందో తెలియదని, ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా బంగ్లా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆందోళనలకు దారితీస్తున్నాయి.