ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

74பார்த்தது
ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సనాల్ అన్సారీ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలు అఫ్రీన్ పర్వీన్ (12), జైబా నాబ్ (8), సపాల్ అన్సారీ (6) ని గొంతు నులిమి చంపి.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన సమయంలో తల్లి పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி