ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం, కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించి పారదర్శకంగా తనిఖీ చేసి, కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది. కొత్త పింఛన్లను జనవరి నుంచి ఇచ్చేలా ప్లాన్ ఉంది. తనిఖీలలో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తనిఖీల్లో అనర్హులుగా తెలితే నోటీసులు ఇచ్చి, వారి పింఛన్లను తొలగించనుంది.