మళ్లీ ఐపీఎల్‌లోకి ద్రవిడ్.. ఈసారి రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా

52பார்த்தது
మళ్లీ ఐపీఎల్‌లోకి ద్రవిడ్.. ఈసారి రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా
భారత మాజీ ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్‌ రాయల్స్‌లో చేరబోతున్నారు. అతడిని రాజస్థాన్‌ హెడ్‌ కోచ్‌గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని ప్రముఖ క్రీడావార్త సంస్థ వెల్లడించింది. రాబోయే మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌ అంశంపై కూడా ఫ్రాంఛైజీతో చర్చలు జరిపినట్లు సమాచారం. ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా తీసుకోవాలని RR యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி