సమాజంలో జరుగుతున్న అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు సింగర్ చిన్మయి. తాజాగా ఆమె ఓ నెటిజన్ పై మండిపడ్డారు. 31st రోజు తమ యాప్ ద్వారా లక్షకు పైగా కండోమ్స్ సేల్ చేసినట్లు బ్లింకిట్ ట్వీట్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ 'ఈ కాలంలో వర్జిన్ అమ్మాయి దొరకడం కష్టమే' అని ట్వీట్ చేశారు. దీంతో 'మగాళ్లు పెళ్లికి ముందు అమ్మాయిలతో సెక్స్ చేయడం ఆపండి. మీ అన్నదమ్ములు, ఫ్రెండ్స్ కు ఆ పని చేయొద్దని చెప్పండి' అని కౌంటర్ ఇచ్చారు.