రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో చాలా రకాల కలలు వస్తుంటాయి. అయితే మీకు కలలో శ్రీరాముడు, హనుమంతుడు కలలో కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని అర్థాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. కలలో శ్రీరాముడు, హనుమంతుడు కలిసి కనిపిస్తే.. ఆ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది. ఈ కల వచ్చిన వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుంది. శ్రీరాముడు, హనుమంతుని కలిసి చూడటం జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోనున్నాయని సంకేతమట.