మన శరీరంలో ముక్కుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే మన ముక్కు గురించి కొన్ని ఆసక్తికర నిజాలు ఇప్పుడు తెలసుకుందాం. మనం ఒకే టైమ్ లో తింటూ గాలి పీల్చడం అసాధ్యం. కానీ అప్పుడే పుట్టిన పిల్లలు ఊపిరి పీలుస్తూ, అదే సమయంలోనే అమ్మ పాలు కూడా తాగగలరు. ఊపిరితిత్తులులు పొడిగాలిని అస్సలు సహించలేవు. ఆ సమయంలో గాలిని పీలిస్తే ముక్కు గాలికి తేమని అందించి శరీరంలోకి పంపిస్తుంది. ముక్కులో సుగంధ ద్రవ్యాల వాసనను చూడగల 400 శక్తివంతమైన ద్రావకాలు ఉన్నాయి.