హైదరాబాద్ రామ్ నగర్‌లోని మల్లెమ్మ గల్లీలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లోనే చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.