2023-24లో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. జాతీయ సగటుతో పోలిస్తే 250.8% సాపేక్ష తలసరి ఆదాయంతో ఢిల్లీ అత్యంత ధనిక ప్రాంతంగా ఉందని, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) నివేదించింది. తర్వాతి స్థానాల్లో తెలంగాణ (193.6%), కర్ణాటక (180.7%) ఉన్నాయి. కాగా, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సిక్కిం 319.1% తో అత్యంత ధనిక రాష్ట్రంగా ఉండగా, ఆ తర్వాత గోవా (290.7%), చండీగఢ్ (235.89%) నిలిచాయి.