కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేటపాలెం మండలానికి చెందిన రమేశ్ అనే కానిస్టేబుల్.. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెదుళ్లపల్లి పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే కానిస్టేబుల్ రమేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.