సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కృష్ణ జలాలపై చర్చ పెడదామని, మేము తప్పుగా మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టు పనులను గాలికొదిలేసి పాలమూరు ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రూ.57.84 లక్షల జీతం తీసుకొని ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు.