తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 'శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలిస్తా. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు' అని సంబంధిత అధికారులను సీఎం హెచ్చరించారు.