కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను దాచేందుకు యత్నించారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. సందీప్ ఘోష్‌పై అత్యాచారం, హత్య అభియోగాలను చేర్చినట్లు ఓ అధికారి తెలిపారు.