బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి (వీడియో)

1091பார்த்தது
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. బాధితులు వందనం మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న మహమ్మద్, ముహాసిన్, ఇబ్రహీం, దేవానంద్, శ్రీదీప్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది.

தொடர்புடைய செய்தி