పట్టపగలు యువకుడి దారుణ హత్య (వీడియో)

81பார்த்தது
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భూసావల్ నగరంలో శుక్రవారం దారుణం జరిగింది. అమర్‌దీప్ టాకీస్ హోటల్‌లో తెహ్రీమ్ నాసిర్ షేక్ అనే యువకుడు టీ తాగుతున్నాడు. ఆ సమయంలో నలుగురు దుండగులు తుపాకులతో అక్కడకు వచ్చారు. తెహ్రీమ్ తలపై పలుమార్లు తుపాకీతో కాల్చారు. దీంతో తెహ్రీమ్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. హత్య తర్వాత నిందితులు గాల్లోకి తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி