బీహార్‌లో విజయదశమి వేడుకల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. విజయదశమి కార్యక్రమాలకు తరలివచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు కత్తులు పంపిణీ చేశారు. ‘ఏ దుర్మార్గుడైనా మన సోదరీమణులను తాకడానికి సాహసిస్తే ఈ కత్తితో అతని చేయి నరికి వేయండి’ అంటూఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ కత్తులు పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.