హర్యానాలోని జింద్‌లో ఓ బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహ్‌తక్ రోడ్డులో బైక్‌పై ఓ యువకుడు ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పి బైకర్‌ను ఆ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌తో సహా ఆ యువకుడు కింద పడ్డాడు. అదృష్టవశాత్తూ లారీ కింద పడలేదు. దీంతో ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.