రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగిస్తూ పశుగ్రాసం సాగు చేసే రైతులకు 100 శాతం సబ్సిడీని అందిస్తోంది. అయితే ఈ సాగు చేసే రైతులకు 5 ఎకరాల్లోపు భూమి ఉండాలి. అలాగే తప్పనిసరిగా జాబ్ కార్డు ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. సన్న, చిన్నకారు రైతు అయివుండాలి. ఇలాంటి రైతులకు ప్రభుత్వం పశుగ్రాసం సాగుకి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుంది.