ముధోల్ మండలం చించాల గ్రామానికి చెందిన గట్టుపెల్లి సాగర అనే మహిళ ఆదివారం ఇంటిబయట సిలెండర్ పై వంట చేస్తుండగా ఆకస్మికంగా సిలెండర్ లీకేజీ తో బారీగా మంటలు వచ్చాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే సిలెండర్ పై ఉన్న వంట పాత్ర వేడికి కరిగిపోయింది. ఇంటి బయట వంట చేయడం తో పేను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.