తాంసిలో ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు మంగళవారం దాడులు చేసినట్లు ఎస్ఐ రాధిక తెలిపారు. మండల కేంద్రానికి చెందిన చింతలవార్ శైలేశ్ అనే వ్యక్తి ఆన్లైన్ మట్కా నిర్వహిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి వద్ద రూ. 29, 360తో పాటు మొబైల్ ఫోన్, చిట్టీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మహారాష్ట్రకు చెందిన అజ్జుతో కలిసి మట్కా నిర్వహిస్తున్నట్లు శైలేశ్ తెలిపాడని ఎస్ఐ వెల్లడించారు.