భీంపూర్ మండలం కరంజి (టి), గోముత్రి, అంతర్గాం తదితర గ్రామాలలో బుధవారం సాయంత్రం సమీప వాగులు, చిట్టడవుల నుంచి చెన్నంగి చెట్టును సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చారు. ఆచారం ప్రకారం తవ్విన బతుకమ్మ బావిలలో చెన్నంగి చెట్టు ప్రతిష్టించి దీపారాధన చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. బతుకమ్మ బావిలలో సూర్య, చంద్ర గద్దెలు వచ్చిన మహిళలను తోటి మహిళలు అభినందించారు. అనంతరం మహిళలు బతుకమ్మ పాటలు పాడారు.