బెల్లంపల్లి పట్టణం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు బిజెపిపై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ పార్టీకి మద్దతుగా ఉత్సాహంగా సభ్యత్వం తీసుకుంటున్నారని వెల్లడించారు.