మనుషులను పోలిన మనుషులు ఉంటారని తెలుసు. తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలోనూ అదే జరిగింది. అచ్చం హేమంత్ సోరెన్‌ను పోలిన వ్యక్తి ఆయనతోనే భేటీ కావడం, ముఖ్యమంత్రే స్వయంగా ఆ ఫొటోలను పంచుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాంచీకి చెందిన మున్నా లోహ్రా ఓ థియేటర్ ఆర్టిస్ట్. ఆయన అచ్చం సీఎం హేమంత్ సోరెన్లానే ఉంటారు. తాజాగా సీఎం ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.