త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి శనివారం ఏలూరు జిల్లాకు రానున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు భాజపా ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనరు మాలతీ రాణి ఇంటికి చేరుకొని. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. 1. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోపీనాథపట్నంలోని శ్రీలక్ష్మీ నారాయణ ఫౌండేషన్ వద్ద భోజన విరామం తీసుకొని ఆపై ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం ఆయన భీమవరం బయల్దేరి వెళ్తారన్నారు.