కాళ్లలో 144 సెక్షన్ పొడిగింపు: ఎస్సై

69பார்த்தது
కాళ్లలో 144 సెక్షన్ పొడిగింపు: ఎస్సై
కాళ్ల మండలం ఏలూరుపాడులో 144వ సెక్షన్ మరో 15 రోజులు పొడిగించినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకివీడు సీఐ ఆధ్వర్యంలో నవంబరు 5 వరకు గ్రామంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా ఏలూరుపాడు, కాళ్ల, పెదఅమిరం గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி