తణుకు పట్టణంలో అన్నాక్యాంటీన్ పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులో అన్నాక్యాంటీన్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు.