పోలవరంలో బయటపడిన శివలింగాన్ని పరిశీలించినా పురావస్తుశాఖ

1154பார்த்தது
పోలవరం ప్రాజెక్టు పైలెట్ ఛానల్ తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ , పోలవరం తాసిల్దార్ బి సుమతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ శివలింగం రాతి వినియోగం, ఆకృతి, ఇటుకల పరిమాణాలను బట్టి 12, 13 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నట్లు తెలిపారు. పరిశీలనాంశాలను పురవస్తు శాఖ కమీషనర్ కి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. పురాతన చరిత్రల దేవతా విగ్రహాలు, అవశేషాలు, ఆలయాలు, గత చరిత్రల శాసనాలు బయట పడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 1996 సంవత్సరంలో పైడిపాక గ్రామంలో తవ్వకాలు చేసిన నేపథ్యంలో 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ భిక్షువుల కాలం నాటివిగా భావిస్తున్న దేవతల విగ్రహాలు, శిథిలావస్థకు చేరిన ఆలయాల అవశేషాలు కనుగొన్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన తరువాత తవ్వకాలు విరమించడం జరిగిందని, తూటిగుంట, చీడూరు, శివగిరి ప్రాంతాల్లో ఉన్న శివలింగాలు పట్టిసీమ శివ క్షేత్రంలో ఉన్న శివలింగం ఒకే కాలానికి చెందినవని, గతంలో ఆయా ప్రాంతాలలో తవ్వకాలు, పరిశోధనలు నిర్వహించామని నిధుల కొరత వల్ల తవ్వకాలు పరిశోధనలు నిలిపివేసినట్లు తెలిపారు. 1996 నుండి 2002 వరకు 800 గ్రామాల్లో సర్వే నిర్వహించామని, పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న వేలేరుపాడు మండలం రుద్రమ కోట, కౌండిన్యముక్తి, ఎటపాక మండలం రాయునిపేట గ్రామాల నుండి పోలవరం ప్రాజెక్టు వరకూ ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో తవ్వకాలలో బయటపడ్డ పురాతన విగ్రహాలను, రాజమండ్రి పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచామని, బయటపడ్డ శివలింగాన్ని ఆలయాల అవశేషాలను కూడా అక్కడికే తరలించనున్నట్లు తెలిపారు. రానున్న వర్షాల సీజనుకి ప్రస్తుతం శివలింగం బయటపడ్డ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుందని వర్షాల సీజనుకి ముందుగానే తవ్వకాలు ప్రారంబిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ విషయంపై పోలవరం ప్రాజెక్టు ఛీఫ్ ఇంజనీర్ తో మాట్లాడుతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వస్తువులు, పురాతన విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி