ఏలూరు నగరంలోని స్థానిక సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో సాంఘిక శాస్త్రాల విభాగాధిపతి డా. పి. రత్న మేరీ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. సిస్టర్ మెర్సి పాల్గొని మాట్లాడారు. అనంతరం ప్రపంచ శాంతిని పెంపొందించటలో ఐక్యరాజ్యసమితి పాత్ర అనే అంశంపై తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.