ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను బుధవారం పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు అందజేయగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.