ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పల్నాడు జిల్లాకు చెందిన బాలినేని తేజ , వెల్పుర్ల వాసులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.