భీమవరం ప్రకాశం చౌక్ లో కైకలూరు, తణుకు, నాగిడిపాలెం, గణపవరం, నుండి జిల్లా కేంద్రమైన భీమవరం చేరుకునే రోడ్లు అధ్వాన స్తితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోతక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో 32 గంటలు నిరసన దీక్షలు చెపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సెక్రటరి కోనాలా భీమారావు, రాష్ట్రవర్గ సభ్యులు కలిశెట్టి వెంకటరాజు, జిల్లా కార్యవర్గం చెల్లబోయిన రంగారావు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి యేలేటి విజయానంద్ పాల్గొన్నారు.