నరసాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ బర్రె వెంకటరమణ గురువారం పట్టణంలో పర్యటించారు. స్థానిక మున్సిపల్ ఆఫీసు వెనక ఓవర్ హెడ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, జంగిల్ క్లియరెన్స్ చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే స్థానిక 14వ వార్డు హిందూ బరియల్ గ్రౌండ్ వద్ద ఉన్న డంపింగ్ యార్డులో పారిశుద్ధ్య వాహనాల ట్రిప్ లాగ్ బుక్‌లను తనిఖీ చేసి, ముంపు ప్రాంతాల్లో నీటిని తోడాలన్నారు.