విశాఖ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి
పారిశ్రామికంగా విశాఖ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ రకాల పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ యూనియన్ల, అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.