ఈనెల 25న విశాఖ జిల్లా అభివృద్ధిపై సమీక్ష
ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఈనెల 25వ తేదీన విశాఖ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర్ ప్రసాద్ తెలిపారు. ఇన్చార్జి మంత్రి హోదాలో తొలిసారి వస్తున్న ఆయన ఆరోజు మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భేటీ అవుతారన్నారు. సోమవారం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ పథకాలు, పరిపాలనాపరమైన అంశాలపైమంత్రి చర్చిస్తారన్నారు.