వీధి వ్యాపారం చేసుకుంటున్న వర్తకులకు వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా హౌకర్ జోన్లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. వీధి వ్యాపారులు గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. వీధి వ్యాపారులతో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వీరందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు.